ఇటీవలి కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచి ప్రదర్శన చేసే యువ ఆటగాళ్లకు ఐపీఎల్ అనే మంచి  వేదిక దొరికింది. ఐపీఎల్ అనేది టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఒక సులభమైన మార్గం గా మారిపోయింది. దీంతో ఇటీవల ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో సత్తా చాటి ఇక టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్లో టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో బౌలర్ గా రాణించిన సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో సంచలనం సృష్టించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.


 ప్రతి బౌలర్ సాధించాలి అనుకునే ఒక అద్భుతమైన స్పెల్ సాయి కిషోర్ సాధించి ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఐ డ్రీమ్ తీర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లిస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో సాయి కిషోర్ (4 -3- 2- 4) వరల్డ్ క్లాస్ గణాంకాలను నమోదు చేశాడు అని చెప్పాలి. నాలుగు ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం గమనార్హం. దీన్ని బట్టి అతడు ఎంత మెరుగైన బౌలింగ్ చేశాడు అన్నది అర్థం చేసుకోవచ్చు.


 ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన చేసి తన జట్టును గెలిపించుకున్నాడు సాయి కిషోర్.. ఐడ్రీమ్ తీర్నూర్ జట్టుపై చెపక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ క్రమంలోనే సాయి కిషోర్ ప్రదర్శన పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు ప్రేక్షకులు. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అనే చెప్పాలి. ఇక వరల్డ్ క్లాస్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన యువ ఆటగాడు టీమిండియా జట్టులో తప్పకుండా ఉండాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే సాయి కిషోర్ ప్రదర్శనపై అటు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl