అతను టీమిండియా వాల్.. భారత జట్టు విజయాలలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రపంచ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రాహుల్ ద్రవిడ్ మేటి క్రికెటర్గా  ఎదిగిన తర్వాత అన్ని విషయాలు ప్రేక్షకులకు తెలుసు. కానీ అంతకుముందు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదట. ఓసారి స్కూల్లో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత కూడా ఓ పత్రికలో ఈ విషయం గురించి రాస్తూ రాహుల్ ద్రవిడ్ పేరును తప్పుగా రాశారట.


 ఇది చూసిన రాహుల్ ద్రావిడ్ అప్పుడే మనసులో అనుకున్నారు. తన పేరు అందరికీ తెలిసేలా చేయాలనే పట్టుదలతో ముందుకు సాగారు. బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత షూటర్ అభినవ్ బింద్రా తో పాడ్ కాస్ట్ లో భాగంగా ఒక ఆసక్తికర ఘటన గురించి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. బహుశా ఆ ఎడిటర్ కచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని భావించి ఉండరు.  ద్రవిడ్ అనే పేరుతో ఎవరికి ఉండదని అనుకుని ఉంటారు. అందుకే ద్రావిడ్ కి బదులు డేవిడ్ అని రాసారేమో అంటూ చెప్పుకొచ్చారు. ఇలా స్కూల్లో సెంచరీ చేసిన తర్వాత కూడా నా పేరు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం.


కాబట్టి ఇక క్రికెట్లో మరింత మెరుగ్గా రాణించాలని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పట్టుదల పెరిగింది. అయితే నా పేరు ఇది అని నమ్మడానికి మాత్రం కొంతమంది అసలు ఇష్టపడలేదు అని చెప్పాలి. అందుకే క్రమక్రమంగా బాగా రాణించి  ఇక భారత క్రికెట్లో కి ఎంట్రీ ఇచ్చి తన పేరు అందరికీ తెలిసేలా చేసాను అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ పేరు తెలియని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఆయన పేరు తెలుసు. ఇక ప్రస్తుతం టీమిండియా క్రికెట్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తు సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: