ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అని ఒక డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఎన్నో విషయాలకు ఈ డైలాగ్ ని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. అలాగే క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడొచ్చామన్నది కాదు ఎన్ని పరుగులు చేశామన్నది కాదు చివర్లో  సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించామ లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా కొంతమంది ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. చివరి బంతికి సిక్సర్ కొడుతూ ప్రేక్షకులను అలరించడం చేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే రెండో వన్డే మ్యాచ్లో భాగంగా అక్షర పటేల్ సిక్సర్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో చివరి బంతికి సిక్సర్ కొట్టి ఇండియాకు విజయాన్ని అందించిన ఆటగాళ్లు ఎవరు అన్నది చర్చకు వచ్చింది..


 ధోని : సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంలో ధోని తర్వాత ఎవరైనా అని చెప్పాలి. ధోని ఫినిషింగ్ ఇన్నింగ్స్ అనగానే 2011 వరల్డ్ కప్ గుర్తుకు వస్తూ ఉంటుంది. 49 ఓవర్లలో రెండో బంతిని సిక్సర్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. 2013లో వెస్టిండీస్ టీమ్ ఇండియా జరిగిన ట్రై సిరీస్ లో కూడా ఇలాగే చివరి బంతికి సిక్సర్ తో ముగించి జట్టుకు విజయాన్ని అందించాడు.


 దినేష్ కార్తీక్  : 2018లో నిదాహస్ లో టీ 20 ట్రోఫీ లో భాగంగా చివరి బంతిని సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు దినేష్ కార్తీక్.  బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో చివరికి టీమిండియా విజయఢంకా మోగించింది.

 హార్దిక్ పాండ్యా : టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్న హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్తో మెరిపించే  మెరుపులు అంతాఇంతాకాదు. 2020 ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ లో చివరి బంతికి సిక్సర్ కొట్టి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మ్యాచ్ జరిగింది అని చెప్పాలి.


 హర్భజన్ సింగ్ :: టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ బ్యాటింగ్ లో కూడా ఎన్నోసార్లు మెరుపులు మెరిపించారు. 2010లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో  బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో హర్భజన్ సింగ్ ఎవరూ ఊహించని విధంగా చివరి బంతిని సిక్సర్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.


 ఇర్ఫాన్ పఠాన్ : 2007లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో ఇర్ఫాన్ పఠాన్ చివరి బంతిని సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు అని చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: