భారత క్రికెట్ చరిత్రలో వివిఎస్ లక్ష్మణ్ దిగ్గజ క్రికెటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఇక ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు కీలక బ్యాట్స్ మెన్ గా వ్యవహరించాడు. అద్భుతమైన విషయాలను అందించడంలో కీలక పాత్ర వహించాడు. ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఏదో ఒక విధంగా క్రికెట్ తో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నాడు దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఇక ప్రస్తుతం బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టుకు కోచ్ గా కూడా వ్యవహరించాడు.


 అయితే ఇలా భారత క్రికెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వివియస్ లక్ష్మణ్కు ఇక ఇప్పుడు ఐసీసీలో కీలక పదవి బాధ్యతలు చేపట్టబోతున్నాడు అనేది తెలుస్తుంది  మెన్స్ క్రికెట్ కమిటీ లో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా వి.వి.ఎస్.లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. భారత దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ని కూడా క్రికెట్ ప్లేయర్ ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే బర్మింగ్హామ్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.



 ఇకపోతే ఇటీవల ఐర్లాండ్ పర్యటన లో టీమిండియా కోచ్గా వ్యవహరించిన వి.వి.ఎస్.లక్ష్మణ్ నేతృత్వంలో టీమిండియా టి 20 సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్లో బరిలోకి దిగింది టీమిండియా అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇదే సమావేశంలో మరికొన్ని కీలక విషయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 2025 లో మహిళల వన్డే ప్రపంచ కప్కు నిర్వహించాలని ఇక ఈ మెగా టోర్నీకి భారథ్ ఆతిథ్యమివ్వనుంది అనే విషయాన్ని కూడా ప్రకటించింది ఐసీసీ. అయితే వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్ కప్ జరగబోతుండగా.. ఇక ఇది ముగిసిన రెండేళ్లలోనే 2025 లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vvs