ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టీమ్ ఇండియా లో ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తోంది. తద్వారా అత్యుత్తమ ఆటగాళ్లను ఇక ఒక జట్టుగా సెలెక్ట్ చేసి ఇక ప్రపంచ కప్లో బరిలోకి దింపాలని నిర్ణయించింది బీసీసీఐ. దీని కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. ఇక పలువురు ఆటగాళ్లకు వరుసగా విశ్రాంతి కల్పించడం వంటివి కూడా చేస్తోంది అన్న విషయం తెలిసిందే.


 అయితే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఇటీవల బిసిసీఐ మరో కీలక ముందడుగు వేసింది అన్నది తెలుస్తుంది.  ప్రఖ్యాత మెంటల్ కండిషనింగ్ కోచ్ పాడి ఆప్టన్ ను  జట్టులోకి తీసుకుంది బిసిసీఐ. దాంతో మరో సారి ఆయన భారత జట్టుతో కలిసి పని చేయనున్నాడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సహాయ సిబ్బంది లో పాడి ఆప్టన్ కీలక సభ్యుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో స్వల్పకాలిక కాంట్రాక్టు తో అతని బీసీసీఐ టీమిండియాతో భాగం చేసింది అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే నేడు వెస్టిండీస్తో జరగబోయే భారత జట్టుతో చేరబోతున్నాడు పాడి ఆప్టన్. ఆస్ట్రేలియా లో టి20 వరల్డ్ కప్ ముగిసేవరకు కూడా భారత జట్టు తోనే కొనసాగుతాడు అన్నది తెలుస్తుంది. పాడి ఆప్టన్ ఎన్నిక కేవలం తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే అని బీసీసీఐ అధికారుల నుంచి  సమాచారం. అయితే గతంలో ఐపీఎల్ లో కూడా మెంటల్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు పాడి ఆప్టన్.  రాజస్థాన్ రాయల్స్కు రాహుల్ ద్రావిడ్ తో కలిసి పని చేశాడు అని చెప్పాలి. తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయిన ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచడంలో ఇతను ఎక్స్పర్ట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: