దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధిస్తే క్రీడాకారులకు అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏదీ ఉండదు అని చెప్పాలి. ఒక్కసారి బంగారు పతకం సాధించిన తమ జీవితం సార్ధకం అయిపోయింది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఎన్నో ఏళ్లపాటు కఠోరంగా శ్రమించి ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది క్రీడాకారులు  కామన్వెల్త్ గేమ్స్.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్  పోటీలు.. ఒలంపిక్స్ లాంటి విశ్వ వేదికలపై సత్తా చాటి దేశం తరఫున బంగారు పతకాలు సాధించాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు కూడా ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని సత్తా ఏంటో చూపిస్తారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో ఎంతో మంది సత్తా చాటితే.. కొంతమందికి నిరాశ ఎదురైంది. అయితే ఇలా నిరాశ పడిన వారు మరోసారి ఆత్మవిశ్వాసంతో పోటీ కొనసాగించేందుకు అవకాశం వచ్చింది. ఇంకోసారి దేశం తరఫున పతకాన్ని సాధించి పెట్టేందుకు సువర్ణ అవకాశం రానే వచ్చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్న సమయంలో నేటి నుంచి కామన్వెల్త్ క్రీడలు కూడా ప్రారంభం కాబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా క్రీడలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కామన్వెల్త్ గేమ్స్ నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. బర్మింగ్హామ్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక ఈ క్రీడలు జరగపోతున్నాయి. ఇక ఓపెనింగ్ సెర్మనీ లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రాతినిధ్యం వహించనుంది అని తెలుస్తుంది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా 72 దేశాల నుంచి 5 వేల మందికి పైగా క్రీడాకారులు   పాల్గొనబోతున్నారు. నేటి నుంచి ఆగస్టు 8 వరకు 12 రోజుల పాటు ఈ క్రీడలు జరుగ నుండగా.. భారత్ నుంచి 214 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 16 విభాగాల్లో పోటీపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: