టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కెప్టెన్ రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్ లో అరుదైన రికార్డులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ భారీగా పరుగులు చేస్తూ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సహా పలువురు విదేశీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ తర్వాత స్థానంలో ఉన్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చాడు.


 టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను వెనక్కి నెట్టేశాడు.  టి 20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్ర స్థానానికి చేరుకున్నాడు మార్టిన్ గప్టిల్. ఇటీవల స్కాట్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు మార్టిన్ గప్టిల్. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మూడు వేల మూడు వందల 79 పరుగులతో టాప్ లో కొనసాగుతుండగా.. ఈ రికార్డును బద్దలు కొట్టి 3399 పరుగులతో టాప్ లోకి వచ్చేశాడు మార్టిన్ గుప్తిల్. రోహిత్ శర్మ 128 మ్యాచ్లలో ఇక ఈ పరుగులు సాధిస్తే మార్టిన్ గప్టిల్ 116 మ్యాచ్ లలోనే 3399 పరుగులు సాధించడం గమనార్హం.


 ఇక టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ఇక రెండవ స్థానం లోకి రోహిత్ శర్మ పడి పోగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3308 పరుగులతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. స్కోట్లాండ్ కు చెందిన పాల్ స్టెర్లింగ్ రెండు వేల 894 పరుగులతో 4వ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2855 పరుగులతో  5వ స్థానంలో ఉన్నాడు. కాగా న్యూజిలాండ్ జట్టు తరఫున టి20 ల లో  3 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మార్టిన్ గుప్తిల్. ఈ క్రమంలోనే మార్టిన్ గప్టిల్ సాధించిన రికార్డు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: