గత కొంతకాలం నుంచి భారత దాయాది దేశమైన పాకిస్థాన్ టెస్టులలో మంచి విజయాన్ని సాధిస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగు పరుచుకుంటూ సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇటీవల శ్రీలంక లో పర్యటించింది పాకిస్తాన్. కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ టెస్టు సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక జట్టుకు మొదటి మ్యాచ్లో షాక్ ఇచ్చింది పాకిస్తాన్ జట్టు.


 గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తర్వాత మ్యాచ్ లో విజయం సాధించకపోయినా మ్యాచ్ డ్రాగా ముగిసిన కూడా పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్ లో  మాత్రం అటు శ్రీలంక జట్టు పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభాత్ జయసూర్య, రమేష్ మొండిస్ అదరగొట్టడంతో ఇక రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఏకంగా 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1 తో సమం చేసుకుంది అనే విషయం తెలిసిందే.


 శ్రీలంక జట్టు భారీ విజయంతో పాకిస్తాన్ కు షాక్ ఇవ్వడమే కాదు ఇక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టిక కూడా ఊహించని దెబ్బ కొట్టింది.  మొన్నటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న శ్రీలంక ఘోరమైన ఓటమి కారణంగా ఇక మూడవ స్థానం నుంచి ఒక్కసారిగా ఐదవ స్థానం లోకి పడి పోయింది. ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు  పాకిస్థాన్ ప్లేస్ లోకి వచ్చింది అని చెప్పాలి. శ్రీలంక మూడవ స్థానంలో కొనసాగుతుండగా భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జట్టు చివరికి ఐదవ స్థానాన్ని సరిపెట్టుకుంది.  కాగా టాప్ 2 లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్థాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: