వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటికీ వన్డే సిరీస్లో భాగంగా పూర్తి ఆదిపత్యాన్ని సాధించి వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్స్వీప్ చేసింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఈ ఇది టి20 సిరీస్ లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ను కూడా క్లీన్స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇక ప్రస్తుతం టి20 సిరీస్ లో భాగంగా ఎవరు బాగా రాణిస్తున్నారు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇక అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టు కూర్పులో చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది అన్న విషయం తెలిసిందే.


 టి20 ప్రపంచకప్ జట్టులో కోహ్లీ స్థానం విషయంలో ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విరాట్ కోహ్లీ కి ఎన్ని అవకాశాలు వచ్చినా మెరుగైన ప్రదర్శన చేయలేక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతనికి వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టులో స్థానం లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ ఆడం గిల్క్రిస్ట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కోహ్లీ ని జట్టు నుంచి తప్పించడం టీమిండియాకు ఎంతో ప్రమాదం అంటూ హెచ్చరించారు.


 ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన హవా నడిపించలేకపోవచ్చు. కానీ అతనికి అపారమైన అనుభవం ప్రతిభ ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్లో ఉన్నత ప్రమాణాలను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. కానీ కొంత మంది మాత్రం అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తున్నారు అంటూ గిల్ క్రిస్ట్ ముంబై క్రికెట్ అసోసియేషన్ యొక్క బాంద్రా కుర్ల కాంప్లెక్స్ ఇండోర్ అకాడమీ లో విలేకర్లతో చెప్పుకొచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఏ స్థానంలో ఉంటుంది అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇండియా జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ అనుభవాన్ని అందరు ప్లేయర్లకు అందిస్తోంది. ఎవరు గెలుస్తారో చెప్పలేము కానీ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఇండియా మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: