భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాల క్రీడలను ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఎప్పటికప్పుడు కళాకారుల ప్రతిభను కొనియాడుతూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సెటైర్లు వేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అంటే అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ఒక పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  గాయం కారణంగా టోక్యో ఒలంపిక్స్ కి దూరమైన భారత్ స్ప్రింటర్ హిమ దాస్ బర్మింగ్హామ్  వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది. ఆసియా గేమ్స్ లో 2020 రెండు స్వర్ణ పథకాలు ఒక రజత పతకం సాధించింది హిమాదాస్. అయితే ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ సోషల్ మీడియాలో 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించింది అంటూ సోషల్ మీడియాలో ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెప్పడం మొదలుపెట్టారు. గతంలో  స్వర్ణం గెలిచిన ఫోటోలను కూడా  మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


 ఈ పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయాయి అనే చెప్పాలి. ఎప్పుడు మీడియాలో యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ సైతం  కంగ్రాచ్యులేషన్స్ చెప్పి పప్పులో కాలేశాడు.  కానీ ఆ తర్వాత ఇది ఫేక్ న్యూస్ అని తెలిసి వెంటనే తన  పోస్టుని డిలీట్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. అప్పటికే ఎంతోమంది ఈ పోస్ట్ ని చూశారు. ఇంకేముంది ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇలా చేయడంతో అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అని చెప్పాలి. అందరూ ఓకే కానీ వీరు బాయ్ నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: