గత కొంత కాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతలా వైఫల్యం చెందుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సెంచరీలతో పరుగుల వరద పారించాడు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం సాదా సీదా ఇన్నింగ్స్ ఆడటానికి కూడా తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి బిసిసిఐ విరాట్ కోహ్లీకి వరుసగా విశ్రాంతిని ఇస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 అయితే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక విరాట్ కోహ్లీ ఇదే వైఫల్యాన్ని కొనసాగిస్తే అతనికి జట్టులో చోటు ఉంటుందా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఇదే ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని తుది జట్టులో ఉంచాలని చూస్తున్నందుకే ఇలా యువకులకు ఓపెనర్లుగా యాజమాన్యం అవకాశం ఇస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 కోహ్లీ వన్డే క్రికెట్ ఆడితే నాకు చూడాలని ఉంది. ఎందుకంటే అతడు ఫామ్ లోకి రావడానికి ఏకైక మార్గం వన్డే ఫార్మాట్ ఒకటే. 50 ఓవర్లలో ఆటలో చాలా సమయం ఉంటుంది. గతంలో శిఖర్ ధావన్, గిల్ లు కూడా వన్డే క్రికెట్ లో నే ఫామ్లోకి వచ్చారు. ఇక క్రికెట్ లో విరాట్ కోహ్లీ కూడా తప్పకుండా ఫామ్లోకి వస్తాడు.  మనం ఎప్పుడు వస్తున్న మార్పులని ఓపెనింగ్ విభాగంలోని చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా విరాట్ కోహ్లీ ని జట్టులో ఉంచడానికి మాత్రమే అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపిస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటు పార్థివ్ పటేల్  తెలిపాడు. కోహ్లి స్థానానికి డోకా లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: