గత కొంత కాలం నుంచి ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ప్రేక్షకాదరణ అంతకంతకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టెస్టు ఫార్మాట్  ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫార్మట్ గా కొనసాగుతూ ఉండేది. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా టెస్టు ఫార్మాట్లో భాగం కావాలని ఎంతగానో ఆశ పడుతూ ఉండేవాడు. అంతేకాదు నాణ్యమైన బౌలర్లు బ్యాట్స్ మెన్ లతో  టెస్ట్ ఫార్మాట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఇక తమలో దాగివున్న అత్యుత్తమ ప్రతిభను కనబరిచేందుకు ఎప్పటికప్పుడు టెస్టు ఫార్మాట్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు క్రికెటర్లు.



 అయితే ఇటీవలి కాలంలో మాత్రం టీ20 ఫార్మాట్ తెర మీదికి వచ్చిన తర్వాత ఇక టెస్ట్ ఫార్మాట్ కి ఆదరణ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో ఎక్కువ కాలం కొనసాగాలి అనే ఆలోచనతో ఎంతో మంది క్రికెటర్లు అటు టెస్ట్ ఫార్మట్ కు కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో టెస్ట్ ఫార్మాట్ కనుమరుగయ్యే పరిస్థితి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్ ను  కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.


 కాగా ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్. తనకు ఎప్పటికీ టెస్టు ఫార్మాట్ పాటు వన్డే ఫార్మాట్  ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్ అంటే తన దృష్టిలో అత్యుత్తమం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్ ఆసక్తి గా ఉంటుందని.. అయితే దీనిలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు మెక్గ్రాత్. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు మాత్రం టీ-20 ఫార్మెట్లో వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని.. అయితేఅలాంటి ఆటగాళ్లు కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నారు అనుకోవడం కూడా సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: