వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ టీ20 సిరీస్ కెప్టెన్గా అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీపై బరిలోకి దిగిన టీమిండియా ఒక మ్యాచ్లో విజయం సాధించి మరో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే కీలకమైన మూడో మ్యాచ్లో తప్పనిసరిగా టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి  సమయంలోనే ఎప్పటిలాగే ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ చివరికి రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక ఫోర్ ఒక సిక్సర్ కొట్టి మంచి టచ్ లో ఉన్న రోహిత్ శర్మ ని చూసి భారీగా పరుగులు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రిటైర్డ్ హార్ట్ క్రీజును వదిలాడు.


 మూడో మ్యాచ్లో భాగంగా టీమిండియా ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేయగా మొదటి బంతికి రోహిత్ శర్మ సిక్సర్ కొట్టాడు. ఇక రెండవ బంతి డాట్ బాల్ కాగా మూడో బాల్ ఫోర్ బాదాడు.  నాలుగో బంతి తర్వాత కాస్త అసౌకర్యంగా కనిపించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే వెన్నునొప్పితో అల్లాడిపోయాడు. లెగ్ సైడ్ స్వీట్ షాప్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్కు కండరాలు పట్టేసాయి. వెంటనే అప్రమత్తమైన ఫిజియో కమలేష్ జైన్ వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి రిటైర్డ్ హర్ట్ కూడా వెనుదిరిగాడు.


 అయితే ఇక రిటైర్ హాట్ గా వెనుదిరిగిన రోహిత్ శర్మ మిగతా టి20 మ్యాచ్ లో అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని సోషల్ మీడియా వేదికగా స్పందించింది బీసీసీఐ. త్వరలో అప్డేట్ ఇస్తామని చెప్పింది. అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ప్రస్తుతానికి పర్వాలేదు. నాలుగో టి20 మ్యాచ్ కు కొన్ని రోజుల సమయం ఉంది. అప్పటివరకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతనికి గాయం తగ్గినప్పటికీ కీలకమైన ఆసియా కప్ నేపథ్యంలో బిసిసీఐ అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: