గత కొంత కాలం నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే . వరుసగా విదేశీ పర్యటనకు వెళుతున్న టీమ్ ఇండియా ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ తిరుగులేదు అని నిరూపిస్తుంది అనే చెప్పాలి. టీమిండియాలో ఎన్నో ప్రయోగాలు  చేస్తున్నా ఎక్కడ జట్టులో క్వాలిటీ మాత్రం దెబ్బ తినడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇటీవలి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినా భారత జట్టు అక్కడ కరేబియన్ గడ్డపై కూడా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదట శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఆడింది. ఈ క్రమంలోనే  మూడు మ్యాచ్లలో విజయం సాధించి క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగినా టీ-20 జట్టు మరోసారి సత్తా చాటింది. మొదటి మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. మూడో మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకుని విజయంతో అదరగొట్టింది.

 ఈ క్రమంలోనే అటు టీమిండియా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించింది అనే చెప్పాలి. లక్ష్య ఛేదనలో టి20 లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2019 జూలై నుంచి 21 మ్యాచ్ లలో రెండవ ఇన్నింగ్స్  లో బ్యాటింగ్ చేసింది. అంటే ప్రత్యర్థి ఇచ్చిన టార్గెట్ ను చేధించింది భారత జట్టు. కాగా 19 సార్లు విజయం సాధించింది. కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన రికార్డు కూడా భారత్ పేరిట నమోదయింది అని చెప్పాలి. ఇలా ఎక్కువ సార్లు లక్ష్యఛేదనలో విజయం సాధించిన జట్టు గా రికార్డు సృష్టించింది. ఇక ఈ విషయం తెలిసి భారత్ అభిమానులు అందరూ కూడా టీమిండియాకు ఇక తిరుగులేదు అంటూ భావిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: