వెస్టిండీస్ తో జరిగిన మూడో టి-20లో  భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ వెనుదిరిగాడు అన్న విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా మైదానం వదిలిన రోహిత్ శర్మ నాలుగో టి20 మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక అతని ఫిట్నెస్ పై అభిమానులు అందరూ కూడా కలవరపడుతున్నారు. అయితే అటు రోహిత్ శర్మ రిటైల్ హర్ట్ గా వెనుదిరిగినప్పటికీ 76 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే అదరగొట్టేశాడు అని చెప్పాలి.


 అయితే ఇటీవలే రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతూ వుండగా..  ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా స్పందించాడు. నాలుగో టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడవద్దు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ ఆన్ సైడ్ బౌండరీ బాదినప్పుడు అతను స్పందించిన విధానం.. ఒక ఆటగాడిగా ఎంత బాధను అనుభవించాడో నాకు తెలుసు. అతను తన ఫిట్నెస్ కి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక వెన్నునొప్పి నేపథ్యంలో రోహిత్ శర్మ తదుపరి రెండు మ్యాచ్ లకు కూడా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోహిత్ జట్టులో  లేకపోయినా పోయేదేమీ లేదు.


 రానున్న రోజుల్లో జరగబోయే ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లకు భారత జట్టుకు రోహిత్ శర్మ అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలోనే అతనికి విశ్రాంతి ఇచ్చి శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ లాంటి వారిని ఓపెనింగ్ ఓపెనింగ్ పంపిస్తే బాగుంటుంది. అంతేకాకుండా కెప్టెన్సీ నిర్వహించడానికి మరికొంతమంది కూడా జట్టులో ఉన్నారు అంటూ పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడారు డానిష్ కనేరియా. కాగా టీ20 ఫార్మాట్ క్రికెట్ లో రోహిత్ శర్మ అద్భుతంమైన ఆటగాడు. అతడిలా ఎవరు ఆడ లేరని డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: