సాధారణంగా ఇతర దేశాలలో క్రికెట్ అనేది అన్ని క్రీడల లాగానే ఒక భాగంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైన మతం అన్నట్లుగా కొనసాగుతూ ఉంది. క్రికెట్ మన దేశపు ఆట కాకపోయినప్పటికీ ఇక ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే క్రికెట్కు ఎక్కువ ఆదరణ ఉంది మాత్రం మనదేశంలోనే అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు సైతం ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మారేందుకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాము.


 ఇలా ఇటీవలి కాలంలో క్రికెటర్లకు ఒకవైపు డబ్బుతో పాటు మరోవైపు పేరుప్రఖ్యాతులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే టీమిండియా తరఫున ఆడాలి అనేది ప్రతి ఒక్క ఆటగాడికి కలగా ఉంటుంది.  కుటుంబంలో గతంలో ఎవరైనా ఇలా టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించి ఉంటే ఇక వారి వారసులు కూడా ఇలాగే టీమిండియాలో కి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం తండ్రి టీమిండియా తరఫున ఆడినప్పటికీ అతను మాత్రం ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడేందుకు సిద్దం అవుతున్నాడు.


 టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కొడుకు హ్యరి సింగ్ భారత్ తరపున కాకుండా ఏకంగా ఇంగ్లాండ్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతూ ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్ అండర్-19 జట్టు శ్రీలంకతో ఆడబోయే సిరీస్కు ఎంపిక అయ్యాడు ఈ ఆటగాడు. ఇక బ్యాటింగ్తో ప్రతిభ కనబరిస్తే రానున్న రోజుల్లో ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. కాగా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ 1986లో కపిల్దేవ్ కెప్టెన్సీలో రెండు వన్డే మ్యాచ్లు ఆడాడు. 51 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కూడా ఆడాడు. బ్రిటన్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: