మొహమ్మద్ షమీ ప్రస్తుతం టీమిండియా లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం ఓ ఫార్మాట్ కి మహమ్మద్ షమీ అంతకంతకూ దూరమైపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టెస్టులు వన్డేల్లో అవకాశం దక్కించుకున్న మహమ్మద్ షమి అటు టి20 ఫార్మాట్లో మాత్రం భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటివరకు ఆడలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమయంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా లేదా అనే ఆందోళన కూడా అభిమానుల్లో మొదలైంది అని చెప్పాలి.


 అయితే సాదాసీదా ద్వైపాక్షిక సిరీస్ కోసమే టీ20 జట్టులో మహమ్మద్ షమీ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.. అలాంటిది ఎంతో అత్యున్నత మైన టి20 వరల్డ్ కప్ లో అతని పేరును పరిగణలోకి తీసుకోవటం అసాధ్యం అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే టీ20 ప్రాబబుల్స్ లో ప్రస్తుతం మహ్మద్ షమీ పేరు లేదు అనే విషయాన్ని ఇటీవలే బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతోంది.


 మహమ్మద్ షమీ ని  వన్డేలు టెస్టులు మాత్రమే ఆడిస్తున్నాము టీ20 ప్రాబబుల్స్ లో అతను లిస్టులో లేడు. ఈ విషయం ఇప్పటికే మహ్మద్ షమీ కి తెలుసు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ కి ముందే ఈ విషయం గురించి మహమ్మద్ షమీ తో చర్చలు జరిపాము. టీ-20 ఫార్మెట్లో మా దృష్టంతా కూడా ప్రస్తుతం కుర్రాళ్ల మీదే ఉంది అంటూ ఒక బీసీసీఐ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్ లో మహ్మద్ షమీ భాగం కాకపోయినప్పటికీ వచ్చే ఏడాది భారత వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో షమి పేరు ఉండే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు అతను ఇదే ఫాంలో ఉంటే అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: