మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో జట్లు ఈ మినీ ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇక ఇలా ఆసియా కప్ లో బాగా రాణించాలని అనుకునే జట్లలో బంగ్లాదేశ్ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఆసియా కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలి అని పట్టుదలతో ఉన్న బంగ్లాదేశ్ జట్టుకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది.  ప్రస్తుతం బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే తొలివన్డేలో పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాలు అయింది బంగ్లాదేశ్ జట్టు. దీంతో ఊహించని షాక్ తగిలింది.


 అయితే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్ జట్టుకు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్ జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న లిటన్ దాస్ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. హోరాహోరీగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లిటన్ దాస్ తొడ కండరాలు పట్టేసాయి. దీంతో 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా చివరికి మైదానాన్ని వీడాడు. అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అన్నది మాత్రం వైద్య బృందం నిర్థారించింది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా స్పష్టం చేసింది.


 దీంతో బంగ్లాదేశ్ జట్టు కి మరో షాక్ తగులుతుంది అన్నది తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో  జరగబోయే ఆసియా కప్ కు అటు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లిటన్ దాస్ స్థానంలో  నజ్మూల్ హుస్సేన్  ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. కాగా లిటన్ దాస్ గత కొన్ని రోజుల నుంచి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారీగా పరుగులు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి ఆటగాడు దూరమవడంతో బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: