దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా మహిళల క్రికెట్ కు అవకాశం దొరికింది అన్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎంతో సువర్ణావకాశంగా భావిస్తున్న మహిళల జట్లు సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే  భారత మహిళల జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శనతో వరుస విజయాలతో దూసుకుపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా స్వర్ణపతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది.


 ఇప్పటికే లీగ్ మ్యాచ్లలో వరుస విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది భారత జట్టు. ఇక సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి విజయఢంకా మోగించింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైనల్లో అడుగుపెట్టింది భారత మహిళల జట్టు. కాగా 8వ తేదీన ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడేందుకు భారత మహిళల జట్టు సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు గణాంకాలు చూసుకుంటే అటు భారత్ పై ఆస్ట్రేలియా దే పైచేయి అన్నట్లుగా కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం ఎంతగానో ఆత్మ విశ్వాసంతో ఉన్న భారత జట్టును ఆస్ట్రేలియా ఏ మేరకు నిలువరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టు లో భాగంగా స్మృతి మందాన సహా మరి కొంత మంది బ్యాట్స్మెన్లు కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నారు. కేవలం బ్యాటింగ్ విభాగంలో మాత్రమే  కాదు బౌలింగ్ లో టీమ్ ఇండియా అదరగోడుతుంది అని చెప్పాలి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లు అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే కామన్ వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ప్రవేశ పెట్టిన మొదటి సారె గోల్డ్ మేడల్ సాధించిన జట్టుగా రికార్డ్ సృష్టించిన్నట్లు అయ్యింది అని చెప్పాలి. కాగా సెమీ ఫైనల్ లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడిస్తే.. ఆస్ట్రేలియా న్యూజీల్యాండ్ ను ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: