సాధారణంగా మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ప్లేయర్స్ అందరూ కూడా ఎంతో అగ్రసీవ్ గానే ఉంటారు. ఈ క్రమంలోనే  చిన్న పొరపాటు జరిగినా కూడా ఇతరులపై కోప్పడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. అయితే ఇలా ఎంత కోపం వచ్చినప్పటికీ క్రికెటర్లు కాస్త హుందాగా ప్రవర్తించ వలసి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కోపం వచ్చింది కదా అని బూతులు తిడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి అస్సలు ఉండదు. ఆటగాళ్లు మైదానంలో ఎలా ప్రవర్తించాలి ఏం మాట్లాడకూడదు అన్న విషయంపై ఐసీసీ కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ఉంటుంది.


 ఇక ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించారు అంటే చాలు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడదు. ఈ క్రమంలోనే ఇలాగే నిబంధనలు ఉల్లంఘించిన ఇంగ్లాండ్ మహిళ ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రాంట్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాకిచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్ వన్ నిబంధన ఉల్లంఘించినందుకు గాను సదరు బౌలర్ ను హెచ్చరించడమే కాదు..  మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.  అంతేకాదు డిసిప్లినరీ యాక్ట్ కింద ఒక పాయింట్ కోత కూడా విధించడం గమనార్హం.


 ఇదిలా ఉంటే కేవలం ఏడాది కాలంలోనే కేథరిన్ బ్రాంట్ ఐసిసి నిబంధనల ఉల్లంఘన ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇప్పటికే రెండు డిమెరిట్ పాయింట్స్ ఉండటంతో మరోసారి కేథరిన్ బ్రాంట్ ఐ సి సి నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇటీవలే కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా టీమ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇలా అసభ్య పదజాలం ఉపయోగించింది ఇంగ్లాండ్ బౌలర్. భారత బ్యాటింగ్ సమయంలో 17 ఓవర్ వేసింది కేతరిన్. అయితే దీప్తి ఇచ్చిన క్యాచ్ వదిలిపెట్టడం తో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది.  ఆమె వ్యాఖ్యలు మైక్ లో రికార్డ్ కావడంతో చివరికి ఐసీసీ చర్యలు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: