గత కొంత కాలం నుండి టీమిండియా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు గెలుపు ఓటములతో సాగిన ఆ ప్రయాణం ఇక ఇప్పుడు కేవలం గెలుపుతోనే ముందుకు సాగుతోంది. ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఎంతో దూకుడుగా ఆడుతూ ఆటగాళ్ళు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం టీమిండియా వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తూ అక్కడ ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది.


 ఈ క్రమంలోనే వరుసగా సిరీస్ లలో టీమిండియా విజయం సాధిస్తోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో విజయం సాధించి 3- 0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు టి20 సిరీస్ లో కూడా అలాంటి ప్రదర్శనతో అదరగొడుతుంది అనే చెప్పాలి. టీ20 సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. కాగా ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుబాయి లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా ప్రదర్శన జట్టు ఎంతగానో ప్రభావం చూపింది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.


 టీ20 ప్రపంచకప్ తరువాత తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాను అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. దూకుడుగా ఆడాలి అని నిర్ణయించుకున్న అంటూ తెలిపాడు. టి20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ పరంగా భారత జట్టు ఘోరంగా విఫలం అయింది. కనీసం ప్లే యాప్ లో కూడా అడుగు పెట్టలేకపోయింది. ఇలాంటి సమయంలోనే కోచ్ రాహుల్ ద్రావిడ్ నేను కూర్చుని జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలని చర్చించాము. ఈ క్రమంలోనే బ్యాటింగ్ తీరు ఆటిట్యూడ్ మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాము. దూకుడుగా ఆడేలా ఆటగాళ్లకు గైడెన్సీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: