గత కొంతకాలంగా వెటరన్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత్కు అంతకంతకూ దూరమైపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అతనికి టీమిండియాలో అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కుతున్నాయి. ఒకవేళ అవకాశం వచ్చిన కేవలం వన్డే  ఫార్మాట్ లో మాత్రమే సెలెక్టర్లు అతని పరిగణలోకి తీసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ అతను మంచి ప్రదర్శన చేసినప్పటికీ కూడా అటువంటి టీ20 జట్టులో సెలెక్షన్ లో మాత్రం శిఖర్ ధావన్ ను పరిగణలోకి తీసుకోవడం లేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే టి20 ప్రపంచకప్కు ముందు ఇలా చేస్తూ ఉండటం పై అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.


 అయితే తనను టి20 జట్టులోకి పరిగణలోకి తీసుకోకపోవడం పై ఇటీవల శిఖర్ ధావన్ స్పందించాడు. ఇటీవల స్పోర్ట్స్ ఛానల్ తో 36 ఏళ్ల ధావన్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే నేను ఏమీ ఫీల్ కావడం లేదు. నిరాశలో కూడా లేను. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు. నేను బాగా ఆడ లేక పోతున్నాను ఏమో.. అయినా నేనేమీ బాధపడడం లేదు. నేను నా వరకూ అద్భుత ఆటతీరును కనబరుస్తూ అని అనుకుంటున్న.. ఏదైనా నేను సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం.. నా పేరు జట్టులో లేకపోయినా అంతమాత్రాన నా ఆటపై అది ఏ మాత్రం ప్రభావం చూపదు. అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటా అంటూ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు.


 అయితే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు శిఖర్ ధావన్. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయినప్పటికీ అతనికి వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్సి అప్పగించింది టీమిండియా యాజమాన్యం. అయితే తన కెప్టెన్సీని తో తన బ్యాటింగ్తో అదరగొట్టిన శిఖర్ ధావన్ వరుసగా జట్టుకు మూడు మ్యాచ్ లలో విజయాన్ని అందించి ఆతిథ్య వెస్టిండీస్ జట్టును మూడు వికెట్ల తేడాతో క్లీన్స్వీప్ చేశాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: