గత కొంత కాలం నుంచి టీమిండియాలో కెప్టెన్సీ మార్పు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. కేవలం ఏడాది కాలంలోనే టీమిండియాకు ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారారు. అయితే ఇది ఏమాత్రం శుభసూచికం కాదని ఇలా చేయడం వల్ల టీమిండియాలో నాణ్యత దెబ్బతింటుందని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అన్ని మ్యాచ్ లకు అతడే అందుబాటులో ఉండే వాడిని.. ఇలా వరుసగా ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందని గుర్తు చేస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కెప్టెన్సీ మార్పుపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఎంతోమంది సారథులు ఉండడం ఎంతో అద్భుతమైన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించగా.. ఆగస్టు 18 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే పర్యటనకు మాత్రం మరోసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహించబోతున్నాడు అనేది తెలుస్తుంది.  ఈ క్రమంలోనే రోహిత్ మాట్లాడుతూ అలాంటి నాయకత్వం జట్టు కలిగి ఉండటం చాలా ముఖ్యమని భావిస్తాను.


 మేము ఐపీఎల్ ఆడుతూ ఉంటాం.. ఇది పది జట్లకు పది మంది కెప్టెన్లు ఉంటారు. వారు ఏదో ఒక దశలో భారత జట్టు లో కూడా భాగం అవుతారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ కుర్రాళ్ళు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఉండడంతో నా పని ఎంతగానో తగ్గుతుంది. జట్టులో చాలా మంది సారధి లను  తయారు చేయడం  మంచి సంకేతం. ఇక ఆటను అర్థం చేసుకోవడం ఒత్తిడిని ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ కోచ్ల సందేశం స్పష్టంగా ఉంటే ఆటగాళ్లు కూడా అలా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: