ప్రస్తుతం టీమిండియా వరుసగా విదేశీ పర్యటనల తో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇక మరికొన్ని రోజుల్లో మినీ ప్రపంచకప్ గా పిలవబడే ఆసియా కప్ జరగబోతుంది. యూఏఈ వేదికగా ఈ మెగా టూర్ నిర్వహించబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా ఈసారి ఆసియా కప్ లో విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా. ఇలాంటి సమయంలోనే ఇక టీమిండియా అభిమానులందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అందింది.. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు అన్నది తెలుస్తుంది.


 ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. జస్ప్రిత్ బూమ్రా ప్రస్తుతం వెన్నునొప్పి గాయంతో బాధపడుతూ ఉన్నాడు. ఇక అంతకు ముందు వెస్టిండీస్ తో జరిగిన వన్డే టి20 సిరీస్ నుంచి కూడా జస్ప్రిత్ బూమ్రా కు విశ్రాంతి లభించింది  ఆసియా కప్ కి సంబంధించిన టీం ని ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టు వివరాల్లో బుమ్రా పేరు లేకపోవడం గమనార్హం. ఇలా ఆసియా కప్ లో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాకు ఇక కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అవడం మాత్రం ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.


 అయితే ఇటీవలి కాలంలో టీమిండియాలో మూడు ఫార్మాట్లలో కూడా కీలకమైన  ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు జస్ప్రిత్ బూమ్రా. అయితే ఇంగ్లాండ్ లో పర్యటించిన సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్ లో భాగంగా వెన్నునొప్పితో బాధపడ్డాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే వెస్టిండీస్తో జరిగిన వన్డే టి20 సిరీస్ ల నుంచి కూడా జస్ప్రిత్ బూమ్రా కు విశ్రాంతి లభించింది.  అయితే ఆసియాకప్ వరకు జస్ప్రిత్ బుమ్రా గాయం నయం అవుతుందని అందరూ అనుకొన్నారు. కానీ ఆసియాకప్ జట్టులో బుమ్రాను సెలెక్ట్ చేయకపోవడం చూస్తే అతను ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 సిరీస్ కు మాత్రం బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: