గత కొంత కాలం నుంచి భారత స్పిన్నర్లు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది అంటే అందులో స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. ఇక కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి ఒకవైపు బ్యాట్స్మెన్  లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తూ తమ స్పిన్ బౌలింగ్ తో మాయాజాలం సృష్టిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను తికమక పెడుతూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండగా ఇక ఎన్నో మ్యాచ్ లలో స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అంతర్జాతీయ టి-20లో భారత స్పిన్నర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.


 ఇటీవల వెస్టిండీస్తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో భారత స్పిన్నర్లు ఏకంగా పదికి 10 వికెట్లు పడగొట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్ధి జట్టు మొత్తం పది వికెట్లు ను కూడా కేవలం స్పిన్నర్లు మాత్రమే తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఐదవ  టి20 మ్యాచ్ లో భాగంగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించారూ. యువ ఆటగాడు రవి బిష్ణయ్  నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ముగ్గురు స్పిన్నర్లు కూడా పదికి 10 వికెట్లు తీశారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో 88 పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ మ్యాచ్లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో శ్రేయస్ అయ్యర్ 40 బంతుల్లో 64 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే చేతులెత్తేసింది అనే చెప్పాలి. దీంతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 4-1 తేడాతో సిరీస్  కైవసం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: