మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియాకప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మినీ ప్రపంచకప్ కోసం అన్ని జట్లు కూడా సిద్ధమైపోయాయ్. ఈ క్రమంలోనే అటు భారత జట్టు కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  ఇందులో భాగంగా ఇటీవలే ఆసియా కప్ కోసం సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును అధికారికంగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో పలువురు ఆటగాళ్లకు చోటు దక్కలేదు అని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ఆసియా కప్ కోసం కేవలం ముగ్గురు పేసర్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు ఆకాశ్ చోప్రా. ముఖ్యంగా ప్రస్తుతం మంచి ఫాంలో కొనసాగుతున్న మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాల్సింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 15 మంది సభ్యులలో షమి కూడా ఖచ్చితంగా  అర్హత కలిగిన ఆటగాడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే అర్ష దీప్ సింగ్ భువనేశ్వర్ కుమార్ కూడా తప్పకుండా జట్టుకు ఎంపిక కావాల్సిన వారే కానీ మూడవ ఫేసర్ గా ఆవేశ్ ఖాన్ తీసుకోవాలా లేకపోతే షమిని తీసుకోవాల అన్న విషయంపై డైలమా నెలకొని ఉండవచ్చు.



 ఇక నా ప్రశ్న ఏమిటంటే.. దుబాయ్ లో సెప్టెంబర్ నెలలో పిచ్ ఫాస్ట్ బౌలర్లను అనుకూలిస్తుంది. ఎక్కువ గ్రాస్ ఉంటుంది. అయితే టోర్నమెంట్ మొత్తానికి కూడా పిచ్ మారే అవకాశం అయితే లేదు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఎంతగానో సహకారం అందిస్తోంది. అందువల్ల నలుగురు పేసర్లను తీసుకోవడంలో సెలెక్షన్ కమిటీ కలిగిన సమస్య ఏమిటి.. అన్ని తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు అంటూ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆకాష్ చోప్రా స్పందించాడు అనే చెప్పాలి. ఇక మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా షమి జట్టులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: