కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టు మంచి ఆరంభం చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తమ ప్రత్యర్థులను ఓడిస్తూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ సెమీ ఫైనల్ లో జరిగిన కీలకమైన మ్యాచ్ లో మాత్రం చివరికి నిరాశతో వెనుదిరిగింది అన్న విషయం తెలిసిందే. భారత మహిళల జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి చివరికి కామన్వెల్త్ గేమ్స్ నుంచి నిష్క్రమించింది ఇంగ్లాండ్ మహిళల జట్టు. దీంతో ఈ సారి ఇలాంటి మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధిస్తుంది అని ఎంతో నమ్మకం పెట్టుకున్న అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు  అని చెప్పాలి.


 అయితే ఇటీవలే కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టు నిరాశపరిచిన నేపథ్యంలో ఆ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న లీసా కిట్లి సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లాండు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో లీగ్ మ్యాచ్లలో అద్భుతంగా ఆడింది ఇంగ్లాండ్ మహిళల జట్టు. సెమీ ఫైనల్లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. దీంతో భారత్ చేతిలో ఓటమి చవిచూసింది.


 సెమీ ఫైనల్లో ఓడిపోయినా ఇంగ్లాండ్ జట్టు అటు కాంస్య పతకం కోసం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘోర పరాజయం పాలైంది అని చెప్పాలి. ఇలా స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్ విభాగంలో పతకం సాధించకుండానే అటు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రయాణాన్ని ముగించింది అనే చెప్పాలి.. ఈ నేపథ్యంలో ఇక అటు ఇంగ్లాండ్ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  ఇలాంటి సమయంలో కోచ్ లీసా కిట్లి తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసింది.. అయితే అంతకు ముందు ఆమె నేతృత్వంలో ఇంగ్లాండుతో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: