గత కొంత కాలం నుంచి కె.ఎల్.రాహుల్ భారత జట్టుకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక సర్జరీ కావడంతో  కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే సరిగ్గా జట్టులోకి వస్తాడు అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాడు కె.ఎల్.రాహుల్. దీంతో ఇక మరి కొన్ని రోజుల పాటు కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజులలో జరగబోయే ఆసియా కప్లో జట్టుతో చేరబోతున్నాడు. అయితే ఇప్పటికే ఆసియా కప్లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. జట్టు లో భాగంగా కె.ఎల్.రాహుల్ స్థానం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. రాహుల్ జట్టులోకి రావడంతో శ్రేయస్ అయ్యర్  జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే  ఇటీవలే బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కేఎల్ రాహుల్ ప్రస్తుతం కోలుకొని పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు.


 అందుకే సెలెక్టర్లు అతడిని జట్టుకు ఎంపిక చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం మాత్రం తప్పనిసరిగా అతడు బెంగళూరులో ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫిట్నెస్ టెస్టులో కనుక కేఎల్ రాహుల్ పాస్ కాకపోతే ఇక ప్రస్తుతం స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవుతాడా లేదా అనేది ఆసక్తికరం గా మారిపోయింది. అయితే గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు కేఎల్ రాహుల్. ఈ ఏడాది ఐపీఎల్లో  616 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రెండో స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: