గత కొంత కాలం నుంచి క్రికెట్ పై పట్టు కోల్పోయిన జింబాబ్వే ఇక ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధిస్తుంది అనేది తెలుస్తుంది. గత కొంత కాలం నుంచి వరుస ఓటములతో తీవ్ర నిరాశలో మునిగిపోయిన జింబాబ్వే జట్టు ఇక ఇప్పుడు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది అని చెప్పాలి. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ అర్హత సాధించేందుకు అద్భుతమైన ప్రదర్శన చేసి చివరికి క్వాలిఫై అయింది అన్న విషయం తెలిసిందే. దీంతో జట్టులోని ఆటగాళ్లు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే ఆనందంలో ఊహించని రీతిలో జోరు కొనసాగుతోంది.


 వన్డే క్రికెట్లో ఎన్నో ఏళ్ల తర్వాత కొత్త రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్ తో సొంత గడ్డపై జరిగిన టీ20 వన్డే సిరీస్లో విజయం సాధించి బంగ్లాదేశ్ జట్టు కు ఊహించని షాక్ ఇచ్చింది. బాంబే క్రికెట్లో మళ్లీ పట్టు సాధిస్తుంది అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది అని చెప్పాలి. తద్వారా మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యామన్న సంతోషమే జింబాబ్వే ఆటతీరును పూర్తిగా మార్చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ దేశంలో సిరీస్ ఆడుతున్నప్పటికి కూడా ఇంతకు ముందెన్నడూ చూడని జింబాబ్వే జట్టును ఇప్పుడు చూస్తున్నట్లుగా క్రికెట్ ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు.


 అయితే ఇటీవల జరిగిన చివరి వన్డే మ్యాచ్లో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయినప్పటికీ విజయం కోసం జింబాబ్వే జట్టు పోరాడిన తీరు మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఏకంగా 260 పరుగులు చేసింది  ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది జింబాబ్వే జట్టు. కానీ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలిపోయింది. ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దీంతో కనీసం వంద పరుగులు అయినా చేస్తుందా లేదా అనే అనుమానం అందరిలో వచ్చేసింది. ఇలాంటి సమయంలోనే రీఛర్డ్ నగర్రావా 34, విక్టర్ 26 పరుగులుతో ఇక పదో వికెట్కు 68 పరుగులు జోడించారు.  జట్టు ఓడిపోయినా  పదో వికెట్కు ఇద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: