మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. సాధారణంగా ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంక వేదికగా ఆసియాకప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఆర్థిక సంక్షోభం కారణంగా ఇక యూఏఈ వేదికగా నిర్వహించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మినీ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. కాగా ఇటీవలే భారత జట్టులోని సభ్యులందరినీ కూడా ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి కూడా ఆసియా కప్ లో అవకాశం కల్పించింది అన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఎంపికపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 అతను బ్యాటింగ్ కి వచ్చే స్థానం దగ్గరనుంచి ఇతర అంశాలపై కూడా చర్చించుకుంటున్నారు. 2018 ఎడిషన్లో ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ లలో విరాట్ కోహ్లీ ఒకడిగా ఉన్నాడు. సచిన్, రోహిత్ శర్మ తర్వాత 756 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.  2010లో మాత్రం ఆసియా కప్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 67 పరుగులు చేశాడు. 2012లో ఆసియా కప్ లో చెలరేగి ఆడి రెండు సెంచరీలు చేశాడు. ఆసియా కప్ టి20 ఫార్మాట్లో 2016 నుంచి కోహ్లీ అదరగొట్టాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. ఫైనల్ మ్యాచ్ లో 28 బంతుల్లో 41 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. కాగా ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో అతని ప్రదర్శన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


 ఇకపోతే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ మానసికంగా పుంజుకోవడానికి ఇటీవలే బిసిసీఐ అతనికి విశ్రాంతి ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీని ఎంపిక చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ మళ్లీ ఆసియా కప్లో ఆడబోతున్నాడు. దీంతో అతని ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అందరి కన్ను ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: