ఇటీవలి కాలంలో వైట్ బాల్ క్రికెట్ లో హార్దిక్ పాండ్యా ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడో క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని చెప్పాలి. కెరీర్లోనే అత్యుత్తమమైన ఫాంలో కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీలో కూడా తనకు తిరుగులేదని ఐపీఎల్లో కెప్టెన్సీ తర్వాత ఇక టీమిండియాకు ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్సీ అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ తన కెప్టెన్సీని వ్యూహాలతో సత్తా చాటాడు..


 ఇటీవల టి20 సిరీస్ లో కూడా చివరి 5వ టి20 మ్యాచ్ కి కూడా కెప్టెన్ వహించే అవకాశం దక్కించుకుని టీమిండియా కు ఘన విజయాన్ని అందించాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు.  తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టీ-20 జట్టుకు హార్దిక్ పాండ్యా సమీప భవిష్యత్తులోనే కెప్టెన్సీ వివరించగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ టోర్నీకి కాకపోయినా మరి కొంత కాలానికి హార్దిక్ పాండ్యా టి20 జట్టుకి పూర్తిస్థాయి కెప్టెన్ అయితే ఆశ్చర్య పోను అంటూ తెలిపాడు.

 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు స్కాట్ స్టైరిష్.  ఇప్పటికే భారత్ తరఫున మూడు టి20 లకు హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించాడు. ఈ మూడింటిలో కూడా టీమిండియా విజయం సాధించింది. అయితే ఆరు నెలల క్రితం హార్థిక్ పాండ్యా గురించి ఇలా మాట్లాడుకుంటామని ఎవరూ అనుకుని ఉండరు. ఈ ఆరు నెలల్లో హార్దిక్ పాండ్యా ఏం చేయాలో చేసి చూపించాడు. ఫుట్బాల్ లో ఎక్కువగా ఇలాంటి అనూహ్య పరిణామాలు చూస్తూ ఉంటాం. కానీ క్రికెట్లో హార్దిక్ పాండ్యా దీన్ని చేసి చూపించాడు అంటూ చెప్పుకొచ్చాడు స్కాట్ స్టైరిష్.

మరింత సమాచారం తెలుసుకోండి: