ఇటీవలి కాలంలో టీమిండియా జట్టు ఎంతో పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ గత కొన్ని రోజుల నుంచీ జట్టులో జరుగుతున్న మార్పులు మాత్రం ప్రతి ఒకరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకు ఇప్పుడు జట్టులో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి అని చెప్పాలి. ఇక భారత జట్టు సిరీస్ గెలిచింది అంటే చాలు రిజర్వు ఆటగాళ్ళకు కూడా జట్టులోకి తీసుకువస్తూ అవకాశం కల్పిస్తున్నారు సెలెక్టర్లు. ఇలా టీమిండియా లో జరుగుతున్న మార్పులు గత కొంత కాలం నుంచి హాట్ టాపిక్ గా మారి పోతున్నాయ్ అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే టీమిండియాలో వరుసగా మార్పులు జరగడం గురించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మేము చాలా ఎక్కువ మ్యాచులు ఆడుతున్నాము. కాబట్టి నిర్విరామంగా ఆడటం వల్ల ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు తీరికలేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి కూడా అవసరం. ఇలాంటి సమయంలోనే రిజర్వ్ బెంచ్ బలంగా ఉండాలి. అందుకే వారికి వరుసగా ఛాన్స్ లు ఇస్తూ ఉన్నాం. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయస్థాయిలో వారి ప్రదర్శన మెరుగవుతుంది. ఇక రానున్న రోజుల్లో భారత క్రికెట్ ను సురక్షితమైన చేతుల్లో పెట్టవచ్చు అనే నమ్మకం వస్తుంది.


 ప్రస్తుతం ఇలాంటి ప్రణాళికతోనే జట్టులో రొటేషన్ జరుగుతూ ఉంద అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.  అయితే ఒక జట్టుగా అందుకే మేము ప్రాధాన్యం ఇస్తామని. అందరం కలిసి రాణిస్తేనే జట్టు విజయం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ కూడా తమ మధ్య జరిగిన సంభాషణల గురించి కూడా తెలిపాడు రోహిత్ శర్మ. రాహుల్ ద్రవిడ్ సర్ భారత జట్టుకు కోచ్గా వచ్చినప్పుడు అతనితో జట్టు ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనే విషయంపై మాట్లాడాను. ఆయన కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. దీంతో జట్టును ముందుకు నడిపించడం ఇంకా సులభం అవుతుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: