గత కొంత కాలం నుంచి టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్ లుగా కొనసాగుతున్న వారు వరుసగా గాయాల బారిన పడుతూ ఉండటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాడు గాయం బారినపడి జట్టు గత కొన్ని సిరీస్ ల నుంచి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు జట్టులో కీలక నేతగా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా సైతం దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్లో ప్రారంభం కాబోయే టి20 ప్రపంచకప్కు బుమ్రా అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం అనుమానంగానే మారిపోయింది అని చెప్పాలి.



 అయితే  బుమ్రా ఇటీవలే తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమయ్యాడు. అయితే అతని వెన్నునొప్పి మరింత వేధిస్తున్నట్లు తెలుస్తుంది.. అయితే 2019లో కూడా బుమ్రా ఇదే రీతిలో వెన్నునొప్పితో బాధపడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎన్నో మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతని గాయం మళ్లీ తిరగబెట్టింది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం జట్టులో కీలక బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా గాయం బిసిసిఐ ఆందోళనకు గురి చేస్తోంది.


 ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా గాయం మా జట్టును కలవరపెడుతోంది. ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అయితే ప్రపంచ కప్కు కేవలం కొన్ని రోజులు ఉన్న సమయం ఉంది. ఇప్పుడు బుమ్రా గాయపడటం దురదృష్టం అని చెప్పాలి . అతను జట్టు ప్రధాన బౌలర్గా కాబట్టి గాయం నుంచి తొందరగా కోలుకొని జట్టులో చేరుతాడని ఆశిస్తున్నాం అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు కూడా బుమ్రా గాయంపై ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: