ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ లో యార్కర్ కింగ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా  టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. టీమిండియాలో కి రావడమే కాదు ఓకే పర్యటనలో 3 ఫార్మాట్ లలో కూడా అవకాశం దక్కించుకుని ఇక నటరాజన్ ఫ్యూచర్ స్టార్ అని ప్రతి ఒక్కరు కూడా నమ్మేలా తన ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు పాటు టీమిండియాలో కొనసాగుతు తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 కానీ ఆ తర్వాత గాయం బారిన పడటంతో చివరికి నటరాజన్ జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ టీమిండియాలో కనిపించకుండా పోయాడు అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎవరు అతన్ని పట్టించుకోలేదు. నటరాజన్ ఏమయ్యాడు అన్నది ప్రస్తుతం అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం బిజీబిజీగా టీమిండియా వరుస పర్యటనలకు వెళుతున్న సమయంలో నటరాజన్ కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే 31 ఏళ్ళ వయసులో జట్టులో స్థానం సంపాదించుకున్న నటరాజన్ తరచూ గాయాల బారిన పడుతున్నాడు.


 ఈ క్రమంలోనే అతని స్థానాన్ని ఎంతో మంది యువ ఆటగాళ్లు భర్తీ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన నటరాజన్ 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. కానీ జట్టు అంతగా రాణించక పోవడంతో అతని ప్రదర్శన మరుగున పడిపోయింది. అయితే వచ్చే టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టుకు దూరమైన నేపథ్యంలో నటరాజన్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: