చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మధ్య మరికొన్ని రోజుల్లో మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచును వీక్షించేందుకు ప్రపంచ ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఇక పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు టిఆర్పి రేటింగ్ బద్దలవడం ఖాయం అన్న విషయం తెలిసిందే. ఆగస్టు 28 వ తేదీన దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఇప్పటికీ ఎంతో మంది మాజీ క్రికెటర్లు జోస్యం చెప్పడం మొదలుపెట్టారు.


 ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే పోరులో విజేత ఎవరు అనే విషయం పై జోస్యం చెప్పారు. ఇంకో 15 -20 ఏళ్ళు అయినా సరే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. క్రికెట్ చరిత్రలో ఈ ఇరు జట్లు కూడా ఎప్పటికీ చిరకాల ప్రత్యర్తులుగానే  అభిమానులు చూస్తూ ఉంటారు. క్రికెట్ లవర్ గా నేను చెప్పేది ఏమిటంటే ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థులు గానే  చూసినప్పటికీ ఇవి కేవలం యాషెస్ సిరీస్ వరకు మాత్రమే పరిమితం. కానీ భారత్ పాకిస్తాన్ ఆధిపత్య ధోరణి అలా ఉండదు వన్డే టెస్ట్ టి20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులు గానే ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆసియా కప్లో 13 సార్లు తలపడితే భారత ఏడు సార్లు పాకిస్తాన్ ఐదు సార్లు గెలిచింది. అందుకే ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియాకి నా ఓటు అంటూ రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.


 అయితే గతంలో భారత జట్టు పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఇక ప్రస్తుతం ఇరు జట్ల కూడా సమాన బలంతో కొనసాగుతున్నాయని ఈ క్రమంలోనే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో విజేత ఎవరు అనేది చెప్పడం కూడా చాలా కష్టమైంది అంటూ వ్యాఖ్యానించాడు రికీపాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: