వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ బ్రావో గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే వెస్ట్ఇండీస్ తరఫున ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన బ్రావో అటు ఐపీఎల్ ద్వారా భారత ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడిన బ్రావో ఇక ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పటివరకు టి20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు బ్రావో. ఏకంగా ఆరు వందలు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి.


 హండ్రెడ్ టోర్నమెంట్లో భాగం గా బ్రావో ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. హండ్రెడ్ టోర్నమెంట్లో భాగం గా నార్తన్ సూపర్ చార్జర్స్ జట్టు తరఫున  ఆడుతున్న బ్రావో ఇటీవలే సామ్ కరణ్ ను అవుట్ చేయడం ద్వారా టీ20లో 600 వికెట్కు అందుకున్నాడు. అయితే సామ్ కరణ్ ను అవుట్ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. అయితే  డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా బ్రావో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక  516 ఇన్నింగ్స్ లలో ఇలా 600 వికెట్లు తీసిన మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ఖాన్ 466 వికెట్లతో రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. వెస్ట్ఇండీస్ కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో మూడవ స్థానం లో ఉన్నాడు. కాగా 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బ్రావో 2021 వరకు కూడా వెస్టిండీస్ జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగాడు. ఇక వెస్టిండీస్ జట్టు 2012, 2016 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో  కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: