ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న మినీ వరల్డ్ కప్ గా పిలవబడే ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఆసియా కప్ కౌంట్ డౌన్ మొదలైంది అన్నది తెలుస్తుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరగబోతోంది. కాగా ఆసియా కప్ 14వ సీజన్ ఇది కావడం గమనార్హం. గత సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన భారత జట్టు ఇప్పుడు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఆసియా కప్ లో మోస్ట్   సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతుంది భారత జట్టు. ఇప్పటి వరకు 7 సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా రికార్డు సృష్టించింది అని చెప్పాలి.


 అయితే ఆసియా కప్ లో టైటిల్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్ సునీల్ గవాస్కర్ కావడం గమనార్హం. అదే సమయంలో కొంతమంది భారత కెప్టెన్లకు ఆసియా అసలు కలిసి రాలేదనే చెప్పాలి. 1984 సీజన్ లో ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. 1986 లో ఆసియా కప్ టోర్నీలో టీమిండియా అసలు ఆడలేదు. 1988 లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో ఆసియా కప్ టైటిల్ను భారత జట్టు 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించి గెలుచుకుంది. దిలీప్ వెంగ్సర్కార్ అప్పుడు కెప్టెన్ వ్యవహరిస్తున్నారు.


 1990- 91 సీజన్లో కూడా ఫైనల్ లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టికరిపించి విజయం సాధించింది. ఇక అప్పుడు మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్గా వ్యవహరించాడు. 1995 లో కూడా శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి హ్యాట్రిక్ కొట్టింది. టీమిండియా మరోసారి మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో 1997 సీజన్లో ఫైనల్ చేరినప్పటికీ చివరికి శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2000 సంవత్సరంలో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో కూడా ఫైనల్కు చేరలేకపోయింది టీమిండియా. అప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నాడు.


 2004లో కూడా సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో ఆసియాకప్ గెలవలేకపోయింది. ఇలా సౌరవ్ గంగూలీకి అస్సలు కలిసి రాలేదు. 2008లో ఎంఎస్ ధోని కెప్టెన్ గా శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.  2010లో లంకను ఓడించి చివరికి టైటిల్ గెలుచుకుంది. ఇక 2012లో మాత్రం ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. అప్పుడు ధోని కెప్టెన్ గానే ఉన్నాడు. 2014 లో ధోనీ రెస్ట్ తీసుకోవడం తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా మూడో స్థానానికి పరిమితమైంది. 2016 లో మళ్లీ ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ లో ఆసియా కప్ టైటిల్ గెలిచింది. 2018 లో విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ కెప్టెన్సీలో  బరిలోకి దిగిన టీమిండియా 7వ సారి టైటిల్ గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: