భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు.  ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ను హై వోల్టేజ్  మ్యాచ్ గా పిలుస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇక ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పై నిషేధం ఉన్న నేపథ్యంలో కేవలం అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులకు అయితే మ్యాచ్ అంటే ఎంతో భావోద్వేగ పూరిత మైనది అని చెప్పాలి.


 అయితే మరికొన్ని రోజుల్లో ఈ హై వోల్టేజ్ బ్యాచ్ ని ప్రేక్షకులు చూసేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్లో భాగంగా ఆగష్టు 28వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో ఎంతో మంది ఇరుదేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్ మాజీ బౌలర్  అకిబ్ జావేద్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి నాణ్యమైన ఆల్రౌండర్ పాకిస్తాన్కు లేడని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య వ్యత్యాసం అంటూ తెలిపాడు.


 అంతేకాకుండా భారత జట్టుకు అపారమైన అనుభవం ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా  మిడిలార్డర్లో నమ్మదగిన ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్థాన్ జట్టులో బాబర్ అనుభవం ఉన్న ఆటగాడు.. మిగతా ఆటగాళ్లంతా కొంత కాలం కలిసి ఆడుతున్నారు. ఇరుదేశాల మధ్య బ్యాటింగ్ విషయంలో మాత్రం వ్యత్యాసం ఉంది. టీమిండియాలో మ్యాచ్ మలుపు తిప్పగల కోహ్లీ రోహిత్ లాంటి ఆటగాళ్లు ఉంటే పాకిస్తాన్లో మాత్రం అలాంటి ఆటగాళ్లు లేరు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ చివరిసారిగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: