గత కొంత కాలం నుంచి టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సంబంధించిన చర్చ అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు మాత్రం సాదాసీదా స్కోర్ చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నాడు. బీసీసీఐ ఎన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ అతను మాత్రం మళ్ళీ తిరిగి లేక పోతున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లిని జట్టు నుంచి పక్కన పెట్టడం బెటర్ అంటూ కొంతమంది సలహాలు ఇవ్వడం కూడా సంచలనంగా మారిపోతుంది.


 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగే ప్రతి మ్యాచ్లో కూడా అతను ఎలా రాణించి బోతున్నాడు అన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది అని చెప్పాలి. 2019 తర్వాత ఇప్పటివరకు అతను ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. మొన్నటి వరకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఆసియా కప్ లో ఆడేందుకు జట్టులోకి వచ్చాడు. దీంతో అతని బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.  కాగా ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


కోహ్లీని ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడనివ్వండి. అతను ఒక పెద్ద ఆటగాడు. ఇప్పటికే చాలా పరుగులు చేశాడు. అతను తిరిగి మళ్లీ పాత ఫాంలోకి వస్తాడని ఆశిస్తున్నాను. అతను సెంచరీ చేయలేకపోయాడు. కానీ ఆసియా కప్ లో తన ఫామ్ అందుకుంటాడు అని కచ్చితంగా చెప్పగలను అంటూ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు అని చెప్పాలి. అయితే గతంలో కూడా విరాట్ కోహ్లీ నుంచి పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీ ని వెనకేసుకొచ్చాడూ అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: