ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఐపీఎల్ లో భాగంగా ధోనీ కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా కీ ప్లేయర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్న ఎన్నో సార్లు తన స్పిన్ బౌలింగ్ తో ఆదుకోవడమే కాదు తన బ్యాటింగ్తో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించాడూ. ఈ క్రమంలోనే తన ఆటతీరు తో ఏకంగా మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది మాత్రం రవీంద్ర జడేజా విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.


 సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు ధోని. అయితే ధోని వారసుడిగా రవీంద్ర జడేజా బాగా రాణిస్తాడూ అనుకున్నప్పటికీ కెప్టెన్గా పూర్తిగా విఫలం అయ్యాడు. దానికి తోడు కెప్టెన్సీ ఒత్తిడితో తన ఫామ్ కూడా కోల్పోయాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ క్రమంలోనే మళ్లీ కెప్టెన్సి ధోనీకి అప్పగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ జడ్డు ఇక సీఎస్కే జట్టులో కనిపించలేదు. ఇక వార్నర్ తరహాలోనే ఇక ఇప్పుడు సిఎస్కె జడేజా విషయంలో వ్యవహరిస్తోందని అందరూ అనుకున్నారు. ఇక అంతే కాదు సామాజిక మాధ్యమాల్లో చెన్నై సూపర్ కింగ్స్ గురించి పెట్టిన పోస్టులను జడేజా తొలగించాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా ఖాతాని అన్ ఫాలో చేశాడు. దీంతో అతడికి చెన్నై సూపర్ కింగ్స్ తో బంధం తెగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఆటగాళ్ల బంధాన్ని దృఢపరచడానికి చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు జడ్డు. దీంతో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కెప్టెన్సీ విషయంలో గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన పరిణామాలే ఫ్రాంచైజీ జడేజా పట్ల విముఖతను పెంచింది అన్నది సమాచారం. ఇక ఇటీవల ధోని పుట్టిన రోజు సందర్భంగా చెన్నై ఆటగాళ్లు అందరినీ కలిపి ఫ్రాంచైజీ ఒక వీడియో విడుదల చేయగా అందులో జడ్డు కూడా కనిపించలేదు. మరి నిజంగానే జడేజా సీఎస్కే కి దూరం అయ్యాడ లేదా అన్నది వచ్చే ఐపీఎల్ సీజన్ లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: