ఎప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్కు సంబంధించిన ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయే భారత మాజీ ఆటగాడు ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ మైదానంలో ఎక్కువగా దూకుడుగా ఉంటాడని.. అయితే అతడు కెప్టెన్గా ఉన్నప్పుడు మాత్రం జట్టులో అలాంటి లక్షణాలు ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ లో తనదైన కెప్టెన్సీ తో నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు కోహ్లి. కాని పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అదే రీతిలో  జట్టును ముందుకు నడిపించి లేకపోయాడు. రోహిత్ మాత్రం కోహ్లీల కాదు అంటూ చెప్పుకొచ్చాడు.



 ప్రత్యర్థి ఎవరైనా పరిస్థితులు ఎలాంటివైనా చేయాలనుకున్నది చేసేందుకు ఎంతో దూకుడుగా ముందుకు సాగుతాడు కోహ్లీ. కానీ అతని కెప్టెన్సీలో జట్టులో  ఆ దూకుడు ఉండేది కాదు. విరాట్ కోహ్లీని  అర్థం చేసుకోవడంలో విఫలమైన జట్టు సభ్యులు కొన్నిసార్లు ఊహించని తప్పిదాలు చేసేవారు. టెస్ట్ కెప్టెన్సీలో మాత్రం కోహ్లీ కి తిరుగు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ మాత్రం కోహ్లీల మైదానంలో దూకుడుగా ఉండడు.. కానీ జట్టు ఆటగాళ్లలో మాత్రం ఆత్మవిశ్వాసం నింపుతూ  వారికి ధైర్యాన్ని ఇస్తాడు. దీంతో కెప్టెన్ వున్నాడు అండతో ప్రతి ఒక్క ఆటగాడు చెలరేగి పోతాడు.


 అంతేకాదు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంతో సైలెంట్ గా ఉన్నప్పటికీ అతని సారథ్యంలో జట్టు మాత్రం ఎంతో దూకుడుగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేశాడు  ఆకాశ్ చోప్రా. కాగా విరాట్ కోహ్లీ  తన కెప్టెన్సీలో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ మాత్రం  గెలిపించలేక పోయాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా విజేతగా నిలుపలేకపోయాడు. అయితే టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. అయితే ఇప్పటికే రోహిత్ ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ సాధించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: