ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా తన ఫేస్ బౌలింగ్ తో తెర మీదికి వచ్చి ఊహించని రీతిలో  పాపులారిటీ సంపాదించింది ఎవరు అంటే అందరు టక్కున చెప్పేస్తారు ఉమ్రాన్ మాలిక్ అని. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు వణుకు పుట్టించే విధంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసురుతూ ఎన్నో అరుదైన రికార్డు సృష్టించాడు. దీంతో అతనిని వెంటనే టీమిండియా లోకి తీసుకోండి అంటూ మాజీ ఆటగాళ్లు అందరూ కూడా బీసీసీఐ ముందు డిమాండ్లు ఉంచారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియా లోకి వచ్చిన అతను అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేక చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు.



 ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ ఫేస్ బౌలింగ్ గురించి ఆస్ట్రేలియా మాజీ పేసర్ ఎమ్ఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ డైరెక్టర్ మెక్గ్రాత్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది యువ పేసర్ లకు శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను చేశాడు ఈయన. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. బంతిపై నియంత్రణను సాధించడానికి ప్రయత్నించే ఫేసర్లు తమ వేగాన్ని  కోల్పోవడం తనకు అస్సలు నచ్చదు అంటూ మెక్ గ్రాత్ చెప్పుకొచ్చాడు. పేస్ బౌలింగ్ ఎప్పుడు ప్రత్యేకమైనదే. ప్రపంచంలోని ఏ బౌలర్ కు అది బలవంతంగా నేర్పించలేము.


 సహజంగా బౌలర్ కి అబ్బితే నే ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. బౌలర్లు బంతిని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా కష్టపడాలి. ప్రాక్టీస్ సెషన్లో ఎక్కువగా దీనిపైన దృష్టి పెట్టాలి. ఫేస్ ను తొలగించకుండా స్పీడుగా బౌలింగ్ చేయాలి. ఎందుకంటే 150 కిలోమీటర్ల కంటే వేగంగా బౌలింగ్ చేసే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ లిస్టులో కి ఉమ్రాన్ మాలిక్ కూడా వస్తాడు. ఈమధ్య అతడు బౌలింగ్లో ఫేస్ ఎక్కువగా కనిపించడం లేదు. కానీ అతని స్పీడ్ నన్ను ఇంప్రెస్స్ చేసింది. అతను కూడా బంతి నియంత్రణలో ఉంచుకునేందుకు స్పీడు తగ్గించకూడదు అంటూ మేక్ గ్రాత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: