సౌరవ్ గంగూలీ.. ఈయన గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తే అవుతుంది.  భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్ల లిస్ట్ తీస్తే మొదటి వరుసలో వినిపించే పేరు సౌరబ్ గంగూలీ. ఇక ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు ఈయన. ఒక గొప్ప ఆటగాడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సారథిగా కూడా టీమిండియా ముందుకు నడిపించాడు సౌరవ్ గంగూలీ. అతని  కెప్టెన్సీ లో టీమిండియా ఎన్నో అరుదైన విజయాలు సాధించింది అనే చెప్పాలి. అంతేకాదు ఇక టీమిండియాకు సరికొత్త దూకుడు నేర్పింది కూడా సౌరవ్ గంగూలీ అని ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు గుర్తు చేస్తూ ఉంటారు.


 ఇలా ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో సేవలు అందించిన సౌరవ్ గంగూలీ ఇక ఇప్పుడు బిసిసిఐ అధ్యక్ష పదవి లో అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ అభ్యున్నతికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్కు చాటుకుంటున్నారు సౌరబ్ గంగూలీ. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి గత కొంత కాలం నుంచి కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరికొన్ని రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.


 ఈ వార్తలపై ఇటీవలే సౌరవ్ గంగూలీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు తాను ఐసీసీ ప్రెసిడెంట్ కాబోతున్నాను అన్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు.ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సౌరవ్ గంగూలీ. ఐసిసి అధ్యక్ష పదవి అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలిపారు. అయితే ఐసిసి అధ్యక్ష పదవి రేసులో తాను లేనని అంటూ సమాధానమిచ్చాడు. కాగా ఐసిసి అధ్యక్ష పదవి లో బ్రేక్ బార్క్లే కొనసాగుతూ ఉన్నారు. కాగా ఈ ఏడాది నవంబరులో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ ఐసిసి అధ్యక్షుడు కాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: