ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ తో వరుసగా మ్యాచ్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వన్డే సిరీస్ ప్రారంభించింది. ఇక మొదటి వన్డే లోనే పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పసికూన నెదర్లాండ్స్ లో రెచ్చిపోయాడు. బౌలర్ల పై  వీరవిహారం చేస్తూ సిక్సర్, ఫోర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇటీవలే నెదర్లాండ్స్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో పాకిస్థాన్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్  తక్కువ  పరుగులకే వెనుదిరిగాడు.  కెప్టెన్ బాబర్ 74 పరుగులు చేశాడు. అదే సమయంలో ఫకర్ జమాన్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు అనే చెప్పాలి.


 దీంతో నిలకడగా రాణిస్తూ 109 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్సులో 12 ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్హం. మరోవైపు బాబర్ and 85 బంతుల్లో 74 పరుగులు చేశాడు. చివర్లో షాదాబ్ ఖాన్ 28 బంతుల్లో 48 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరికి నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది పాకిస్తాన్. ఇదిలా ఉంటే నెదర్లాండ్ పై శతకంతో చెలరేగిన ఫకర్ జమాన్  ను టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పసికూన నెదర్లాండ్స్ పై ప్రతాపం చూపించడం కాదు.. ఆసియా కప్లో టీమ్ ఇండియా తో మ్యాచ్ లో ఆడి చూపించు. అప్పుడు తెలుస్తుంది నీ అసలు ఆట అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.


 కాగా ఆసియా కప్లో భాగంగా ఆగస్టు 28 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు జరుగుతుంది. ఇక ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు ఎదురు చూస్తుంది మాత్రం చిరకాల ప్రత్యర్థులైన టీమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అని చెప్పాలి. అయితే గత ఏడాది అనూహ్యంగా పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్ ఆసియా కప్ లో మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.  ఇక రెండు నెలల వ్యవధిలోనే భారత్ పాకిస్తాన్ మధ్య రెండు సార్లు మ్యాచ్ జరగబోతోంది. ఒకటి ఆసియా కప్లో మరొకటి టీ20 వరల్డ్ కప్ లో. దీంతో అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పక్క అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: