టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. ఈయన గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తే అవుతుంది. ఎందుకంటే ఒకసారి యువరాజ్ సింగ్ పేరు వినిపించింది అంటే చాలు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ అందించిన అరుదైన విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. భారత జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్ తన బ్యాటింగ్తో నేర్పించిన మెరుపులు ఇప్పటికీ ప్రేక్షకుల మర్చిపోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే క్యాన్సర్ను జయించి మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకుని యువరాజ్ పెద్దగా రాణించలేక పోవడంతో చివరికి జట్టుకు దూరమయ్యాడు. తద్వారా చివరికి కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


 అయితే ప్రస్తుతం ఈ మాజీ ఆల్రౌండర్ నెట్స్ లో చెమటోడుస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు యువరాజ్ సింగ్. బ్యాటింగ్ లో తీవ్రంగా శ్రమిస్తూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువరాజ్ సింగ్ ఏ టీం మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ ఒక అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బిసిసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఒక మ్యాచ్ జరగబోతోంది.


 ఈ మ్యాచ్ కి బిసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించబోతున్నాడు. ఈ జట్టులో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా యూసుఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్ళకు కూడా అవకాశం దక్కింది. ఇక వరల్డ్ జెయింట్స్ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించి పోతున్నాడు. ఇకపోతే ఇటీవల తాను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ని యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. వారియర్ ఇస్ బ్యాక్ అంటూ చెబుతున్నాడు యువరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: