మరో రెండు వారాలలో ఆసియా కప్ 2022 మొదలు కానుంది. ఈ టోర్నీలో సత్తా చాటడానికి ఆసియా క్రికెట్ జట్లు ఇప్పటికే అన్ని అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నాయి. ఇక ఆసియా కప్ లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే క్రికెట్ ప్రముఖులు చెబుతున్న ప్రకారం ఆసియా కప్ ను గెలిచే సత్తా ఒక్క టీమ్ ఇండియాకు మాత్రమే ఉందట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి... ఇటీవల కాలంలో ఇండియా జట్టు పూర్తిగా యువకులతో నిండి అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని చూపిస్తోంది. సీనియర్లు లేని చోట కూడా కేవలం యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతూ వారు లేని లోటును పూడుస్తున్నారు.

ఇక ఇదే సమయంలో మిగిలిన జట్ల పరిస్థితి చూస్తే ఏమంత బాగాలేదు . ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. ఇండియాకు పోటీ ఇచ్చే సత్తా ఒక్క పాకిస్తాన్ కు తప్పించి మరే జట్టుకు లేదని స్పష్టంగా అర్దం అవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే పడుతూ లేస్తున్న శ్రీలంక ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ జట్టు అయితే ఎప్పుడు ఏ విధమైన ప్రదర్శన చేస్తుందో ఊహించలేము. తనదైన రోజున మాత్రం చెలరేగి ఆడగలదు. ఇక మహమ్మద్ నబీ కెప్టెన్ గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది.

ప్రస్తుతం అయితే చిన్న చిన్న జట్లను ఓడిస్తూ... చిన్న జట్లకు రారాజుగా ఉంది. మరి ఆసియా కప్ లాంటి టోర్నీలో రాణించాలంటే అంతకు మించిన ఆటతీరును చూపించాలి. ఏ విధంగా చూసుకున్నా ఆసియ కప్ ను గెలిచే సత్తా ఇండియాకు మాత్రమే ఉంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి ఇండియా కు టైటిల్ పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: