ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పటికే మూడు టీ 20 ల సీరీస్ లో 2-1 తేడాతో వెస్ట్ ఇండీస్ ను ఓడించి సీరీస్ ను దక్కించుకుంది. పూరన్ కెప్టెన్సీ లో రెండు టీ 20 లలో ఓడిపోయినా .. ఆఖరి మ్యాచ్ లో పుంజుకుని పరువు దక్కించుకుంది. ఆ తర్వాత మూడు వన్ డే ల సీరీస్ లో భాగంగా మొదటి వన్ డే గత రాత్రి బార్బడోస్ వేదికగా జరిగింది. ఇందులో మొదట టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తమకంటే ఎంతో బలమైన కివీస్ ను ఎదుర్కోవడం చాలా కష్టమే.. అందులోనూ కివీస్ రెగ్యులర్ కెప్టెన్ విలియంసన్ జట్టుతో చేరడం ఇంకా బలం ఇచ్చే విషయమే.

ఇన్ని ప్రతికూలతల మధ్యన మొదటి వన్ డే స్టార్ట్ అయింది. అయితే ఆరంభం నుండి కివీస్ ఆటగాళ్ళు కుదురుకోలేదు అని చెప్పాలి. ముఖ్యంగా విండీస్ స్పిన్నర్ అకీల్ హోసెన్ తన స్పిన్ మాయాజాలంతో ఓపెనర్లు గుప్తిల్ (24) , ఫిన్ అలెన్ (25), కాన్వే (4) లను ఔట్ చేసి కివీస్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇతనికి సపోర్ట్ గా అల్జరి జోసెఫ్ 3 వికెట్లు మరియు హోల్డర్ 2 వికెట్లు తీసి కివీస్ ను కేవలం 190 పరుగులకు ఆల్ ఔట్ చేశారు. ఈ విధమైన ప్రదర్శనను బహుశా విండీస్ జట్టు యాజమాన్యం కూడా ఊహించి ఉండకపోవచ్చు.

ఇక 191 పరుగుల లక్ష్యంతో చేదన స్టార్ట్ చేసిన విండీస్ కూడా అంత సులభంగా ఏమీ నెగ్గలేదు. జట్టులోని సగం వికెట్లను కోల్పోయి 39 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించి సీరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. విండీస్ లో షమర్ బ్రూక్స్ 79 పరుగులు చేసి విండీస్ కు విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మరియు సౌతీ లు తలో రెండు వికెట్లు అందుకున్నారు. అయితే కివీస్ జట్టుకు ఈ విధమైన ఓటమి మాత్రం మింగుడు పడనిది అని చెప్పాలి. అసలే ఏ మాత్రం ఫామ్ లో లేని విండీస్ చేతిలో ఓటమి నుండి కోలుకుని సీరీస్ ను దక్కించుకుంటుందా ? లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: