మొన్నటి వరకు టీమిండియాకు దూరమైన కార్ ఓపెనర్ శిఖర్ ధావన్  ఇక ఇటీవలే టీమిండియా జట్టులో మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా లోకి పునరాగమనం చేసిన శిఖర్ ధావన్ ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించాడు. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు అనే విషయం తెలిసిందే. ముందుగా అతనికి  కెప్టెన్సీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కె.ఎల్.రాహుల్ అందుబాటులోకి రావడంతో ఇక సారధ్య బాధ్యతలను అతనికి అప్పగించింది టీమిండియా యాజమాన్యం.


 ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి అవకాశాలు దక్కించుకుంటున్న శిఖర్ ధావన్ అత్యుత్తమమైన ఫామ్ కనబరుస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. తద్వారా ఎన్నో రికార్డులను కూడా కొల్లగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.  ఇక ఇటీవలే ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు శిఖర్ ధావన్. జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా 81 పరుగుల తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో శిఖర్ధావన్ కీలకపాత్ర వహించాడు.


 ఈ క్రమంలోనే వన్డేలలో ఒక అరుదైన ఘనత ఖాతాలో చేరిపోయింది. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 6500 పరుగుల మైలురాయిని అనుకున్న పదో భారత బ్యాట్స్మన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. కాగా వన్డేల్లో 6500 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు లిస్టు చూసుకుంటే.. సచిన్‌ టెండూల్కర్-18426 పరుగులు, విరాట్‌ కోహ్లి-12344 పరుగులు, సౌరవ్‌ గంగూలీ- 11363 పరుగులు, రాహల్‌ ద్రవిడ్‌-10889 పరుగులు, ఎంఎస్‌ ధోని-10773 పరగులు, ఎం అజారుద్దీన్- 9378 పరుగులు, రోహిత్‌ శర్మ-9378 పరుగులు, యువరాజ్‌ సింగ్‌-8701 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్-8273 పరుగుల తో వుండగా ఇప్పుడు శిఖర్‌ ధావన్‌-6508 పరుగులతో ఈ లిస్టులో చేరాడు. అయితే శిఖర్ధావన్ అరుదైన రికార్డు సాధించటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: