గత కొంత కాలం నుంచి టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా విదేశీ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఫార్మాట్ తో సంబంధం లేకుండా సిరీస్ లు విజయం సాధిస్తూ సత్తా చాటుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వరుస సిరీస్లలో విజయం సాధించిన టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో కూడా తిరుగులేదు అని నిరూపించి పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ఇక ఇప్పుడుపసికూన జింబాబ్వే జట్టు పై కూడా వన్డే సిరీస్లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.


 ఈ క్రమంలోనే ఇటీవల హరారే వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లైవ్ టీమ్ ఇండియా శుభారంభం చేసిన ఘన విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జింబాబ్వే జట్టుకు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే జింబాబ్వే తమ ముందు ఉంచిన టార్గెట్ ను చేదించి సత్తా చాటింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే మూడు వన్డేల మ్యాచ్లో భాగంగా 1-0 తో ఆధిక్యంలోకి వచ్చేసింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి జట్టులో వరుసగా ఆటగాళ్లను మార్పు చేస్తూ వస్తోంది టీమ్ ఇండియా యాజమాన్యం. వెరసి వరుస ప్రయోగాల పై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 కాగా ఇదే విషయంపై ఎన్నోసార్లు స్పందించిన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న బిజీ క్రికెట్ షెడ్యూల్ దృశ్య రిజర్వ్ బెంచ్ ను కూడా మరింత బలోపేతం చేయాల్సి ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులో ఒకరో ఇద్దరో పైన ఆధారపడటం లేదని ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై నేను, కోచ్ చర్చిస్తున్నాం. జట్టు గెలవడానికి అందరూ తమ వంతుగా రాణించాలి. అలాంటి జట్టు మాకు కావాలి అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అందుకే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాం అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: