ప్రస్తుతం టీం ఇండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. అందులో భాగంగా ఇండియా మూడు వన్ డే ల సిరీస్ ను ఆడనుంది. కాగా నిన్న మొదటి వన్ డే హరారే వేదికగా జరిగింది. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె ఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ ఐపీఎల్ తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. ఈ సిరీస్ కు ముందు జింబాబ్వే ఆటగాళ్లు మరియు కోచ్ లు ఇండియాను ఖచ్చితంగా ఓడించి సిరీస్ నెగ్గుతాము అంటూ ప్రగల్భాలు పలికారు. దీనికి కారణం బంగ్లాదేశ్ ను ఓడించడమే.

అయితే ఈ విషయాలను టీం ఇండియా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఇన్నింగ్స్ ను ఆరంభించిన కయా మరియు మరుమాని లు మొదటి అయిదు ఓవర్లు ఆచితూచి ఆడారు. కానీ ఆ తర్వాత చాలా కాలం తర్వాత వన్ డే ఆడుతున్న దీపక్ చాహర్ స్వింగ్ ముందు నిలబడలేకపోయారు. దీపక్ చాహర్ వరుసగా ఓపెనర్లు మరియు మదేవేరే లను అవుట్ చేసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఇక ఆ తర్వాత ప్రసాద్ కృష్ణ 3 వికెట్లు మరియు అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి జింబాబ్వేను 189 పరుగులకు ఆల్ అవుట్ చేశారు.

జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా చేసిందంటే దానికి కారణం బ్రాడ్ ఎవాన్స్ మరియు ఎంగరవా ల భాగస్వామ్యమే అని చెప్పాలి. వీరిద్దరూ 9 వ వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్లు ధావన్ మరియు శుభమాన్ గిల్ లు వికెట్ లేకుండా 190 పరుగులు చేధించారు. ఓపెనర్లు ఇద్దరూ అర్ద సెంచరీలు పూర్తి చేసుకోవడం గమనార్హం. అయితే మ్యాచ్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ రెజిస్ చకబ్వా మాట్లాడుతూ మొదటి మ్యాచ్ లో ఇండియా గెలిచి ఉండవచ్చు. కానీ రెండవ మ్యాచ్ లో మా తడాఖా ఏమిటో చూపిస్తాము అంటూ మరోసారి గొప్పలు పలికాడు. మరి రేపు జరగబోయే రెండవ వన్ డే లో వీరి తడాఖా ఇండియాకు చూపిస్తారా లేదా మరో ఓటమిని మూటగట్టుకుంటారా చూడాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: